Abhinav Kashyap: నా శత్రువు సల్మాన్ ఖాన్... నా కెరీర్‌ను నాశనం చేశాడు: అభినవ్ కశ్యప్

Salman Khan spoiled my career says  Director Abhinab Kashyap
  • నా కెరీర్ ను కంట్రోల్ చేయాలనుకున్నారు
  • వేరే వాళ్లతో సినిమా చేయడాన్ని అడ్డుకున్నారు
  • వయాకామ్ సంస్థను కూడా బెదిరించారు
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు ఒక మంచి వ్యక్తిగా పేరుప్రఖ్యాతులు ఉన్నాయి. 'బీయింగ్ హ్యూమన్' ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను ఆయన చేపడుతున్నాడు. అలాంటి సల్మాన్ పై బాలీవుడ్ డైరెక్టర్ అభినవ్ కశ్యప్ తీవ్ర ఆరోపణలు చేశాడు. సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ చిత్రం 'దబాంగ్'ను అభినవే తెరకెక్కించాడు. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఆయనే తెరకెక్కించాల్సి ఉంది. అయితే అది వర్కౌట్ కాలేదు.

దీనికి సంబంధించి అభినవ్ కశ్యప్ మాట్లాడుతూ, సల్మాన్ ఖాన్ సోదరులు అర్భాజ్ ఖాన్, సొహైల్ ఖాన్ తన కెరీర్ ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించాడు. దానికి తాను అవకాశం ఇవ్వకపోవడంతో తన కెరీర్ ను నాశనం చేశారని చెప్పాడు. 'దబాంగ్' తర్వాత వేరే వాళ్లతో సినిమా చేద్దామనుకుంటే, అడ్డుకున్నారని తెలిపారు. వయాకామ్ సంస్థతో చేతులు కలిపితే... ఆ సంస్థను కూడా బెదిరించారని చెప్పారు. వాళ్లు చేసిన పనికి తాను వారి నుంచి తీసుకున్న రెమ్యునరేషన్ రూ. 7 కోట్లతో పాటు... రూ. 90 లక్షల వడ్డీ కట్టాల్సి వచ్చిందని వాపోయాడు.

తన సినిమా 'బేషరమ్'ను కూడా అడ్డుకునేందుకు యత్నించారని... శాటిలైట్ బిజినెస్, రిలీజ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. తన శత్రువులు సల్మాన్ ఖాన్, సలీం ఖాన్ (సల్మాన్ తండ్రి), అర్భాజ్ ఖాన్, సొహైల్ ఖాన్ ల గురించి అందరికీ తెలియాలని అన్నారు.
Abhinav Kashyap
Salman Khan
Bollywood

More Telugu News