Sushant Singh Rajput: సుశాంత్ డిప్రెషన్ పై ఆయన తండ్రి కేకే సింగ్ స్పందన

Sushant Singh Rajputs father responds on depression
  • సుశాంత్ డిప్రెషన్ తో బాధ పడుతున్నట్టు మాకు తెలియదు
  • డిప్రెషన్ కు ఎందుకు గురయ్యాడో తెలియదు
  • మేము ఎవరినీ అనుమానించడం లేదు
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఎంతో మంది ఆయన మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కొంత కాలంగా సుశాంత్ డిప్రెషన్ తో బాధపడుతున్నాడని కొందరు చెపుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఉంటున్న ఇంట్లో డిప్రెషన్ కు వాడే మెడిసిన్స్ కూడా లభించాయి. మరోవైపు, సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ తో ముంబై పోలీసులు మాట్లాడారు. పలు విషయాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయన నుంచి సేకరించే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా కేకే సింగ్ మాట్లాడుతూ, సుశాంత్ డిప్రెషన్ తో బాధ పడుతున్నట్టు తనకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ తెలియదని చెప్పారు. తన కుమారుడు డిప్రెషన్ కు ఎందుకు గురయ్యాడో తెలియదని అన్నారు. సుశాంత్ మరణం విషయంలో తాము ఎవరినీ అనుమానించడం లేదని చెప్పారు. మరోవైపు పోలీసులు ప్రస్తుతం సుశాంత్ మేనేజర్, స్నేహితులను విచారిస్తున్నారు.
Sushant Singh Rajput
Depression
Bollywood
Father

More Telugu News