Damodaran: తమిళనాడులో కరోనా మరణమృదంగం... సీఎం పళనిస్వామి పీఏ మృతి

Tamilnadu Chief Minister personal assistant dies of corona
  • తమిళనాడులో 50 వేలకు దగ్గర్లో ఉన్న పాజిటివ్ కేసులు
  • ఇప్పటికే డీఎంకే ఎమ్మెల్యే కరోనాతో కన్నుమూత
  • రెండ్రోజుల కిందట చెన్నై ఆసుపత్రిలో చేరిన ముఖ్యమంత్రి పీఏ దామోదరన్
తమిళనాడులో కరోనా రక్కసి విలయం మరింత ఉద్ధృతమైంది. పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలకు సమీపించింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. రాష్ట్రంలో సామాన్యులకే కాదు ప్రజాప్రతినిధులు, వారి సిబ్బందికి కూడా రక్షణ లేదన్న విషయం మరోసారి నిరూపితమైంది. ఇప్పటికే కరోనా ధాటికి డీఎంకే శాసనసభ్యుడు అన్బళగన్ కన్నుమూశారు.

 ఈసారి ఏకంగా, ముఖ్యమంత్రి పళనిస్వామి పీఏ దామోదరన్ కరోనాతో ప్రాణాలు విడిచారు. దామోదరన్ కు రెండ్రోజుల కిందట కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనను చెన్నై ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించారు. దాంతో సీఎం కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.
Damodaran
Corona Virus
Death
Chief Minister
Tamilnadu

More Telugu News