Russia: పుతిన్ కోసమే... ప్రత్యేక డిజిన్ఫెక్షన్ టన్నెల్ తయారు చేసిన రష్యా!

Special Disinfection Tunnel at Putin House
  • అధికారిక నివాసం ముందు అత్యాధునిక టన్నెల్ 
  • దానిలోకి వెళ్లిన తరువాతే పుతిన్ పలకరింపు
  • వైరస్ లను చంపేస్తుందన్న న్యూస్ ఏజన్సీ ఆర్ఐఏ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు కరోనా వైరస్ సోకకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయన అధికారిక నివాసమైన నోవో-ఒగార్యోవో ముందు అత్యాధునిక డిజిన్ఫెక్షన్ టన్నెల్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడే తనను కలిసేందుకు వచ్చిన వారిని పుతిన్ కలుస్తారు. పెంజా పట్టణానికి చెందిన ఓ రష్యన్ కంపెనీ దీన్ని తయారు చేసింది.

ఈ టన్నెల్ డిమాన్ స్ట్రేషన్ ఫుటేజ్ ని ప్రభుత్వ రంగ న్యూస్ ఏజన్సీ ఆర్ఐఏ విడుదల చేసింది. ఈ టన్నెల్ లోకి ప్రవేశించిన వారిపై రసాయనాలు చిలకరించబడతాయి. దీంతో వారిపై ఏవైనా కరోనా క్రిములు, ఇతర వైరస్ లు చేరివుంటే అవి నశిస్తాయి. ఆ తరువాతే పుతిన్ వారిని కలుస్తారు. కాగా, ఇంతవరకూ రష్యాలో 5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో అత్యధికంగా కేసులు నమోదైన దేశాల్లో రష్యా మూడవ స్థానంలో ఉంది. ఇప్పటివరకూ 7,284 మంది వైరస్ కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు.
Russia
Putin
Tunnel
Disinfection

More Telugu News