Tollywood: భారత్‌-చైనా ఘర్షణ: మహేశ్ బాబు సహా టాలీవుడ్ ప్రముఖుల స్పందన

tollywood actors on china india violent face off
  • వీరమరణం పొందిన జవాన్లకు టాలీవుడ్ నటుల సెల్యూట్ 
  • త్యాగాల గుర్తులు మన హృదయాల్లో ఉండిపోతాయి: మహేశ్
  • వీర జవాన్ల బలిదానం పట్ల మాటలు రావట్లేదు: సాయితేజ్
  • భారత జవాన్లకు సెల్యూట్‌ చేస్తున్నాను: కాజల్
భారత్‌-చైనా మధ్య చోటు చేసుకుంటోన్న ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయంపై టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. వీరమరణం పొందిన జవాన్లకు సెల్యూట్ చేశారు.

'గాల్వన్‌ లోయ వద్ద మన జవాన్లు అమరులయ్యారని తెలుసుకుని కలత చెందాను. వారి త్యాగాల గుర్తులు మన హృదయాల్లో ఎప్పటికీ ఉండిపోతాయి. మన యోధులకు, వారిలోని దేశ భక్తికి సెల్యూట్ చేస్తున్నాం. అమరులైన జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను' అని మహేశ్ బాబు పేర్కొన్నారు.

'లడఖ్‌లో మన వీర జవాన్ల బలిదానం పట్ల మాటలు రావట్లేదు. దేశాన్ని కాపాడడం కోసం విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల కుటుంబాలకు నా సానుభూతి' అని సాయితేజ్ ట్వీట్ చేశాడు.  

'బరువెక్కిన గుండెతో ఈ వార్త చదివాను. అమరవీరులకు సెల్యూట్' అని సుధీర్ బాబు పేర్కొన్నాడు.

'అమరులైన భారత జవాన్లకు సెల్యూట్‌ చేస్తున్నాను. ఓం శాంతి.. అమరులైన జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను' అని హీరోయిన్ కాజల్ అగర్వాల్ పేర్కొంది.  

'మేము దేశంలో ప్రశాంతంగా ఉండగలగడానికి మీ శౌర్య, పరాక్రమాలే కారణం. థ్యాంక్యూ, సెల్యూట్‌. ఇండియన్ ఆర్మీ జిందాబాద్' అని అనసూయ ట్వీట్ చేసింది.
Tollywood
Mahesh Babu
India
China

More Telugu News