China: బీజింగ్ లో కొత్తగా కరోనా కేసులు.. 1,255 విమానాలను రద్దు చేసిన చైనా!

Above 1200 Flights Canceled from Bejing
  • చైనాను బెంబేలెత్తిస్తున్న కరోనా
  • బీజింగ్ లో 31 కొత్త కేసులు
  • అప్రమత్తమైన అధికారులు
కరోనా సెకండ్ సైకిల్ ప్రారంభమై, చైనాను బెంబేలెత్తిస్తున్న వేళ, బీజింగ్ లోని ప్రధాన ఎయిర్ పోర్టుల్లో 1,255 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారని అధికార పత్రిక 'పీపుల్స్ డైలీ' వెల్లడించింది. తాజాగా, ఓ హోల్ సేల్ ఫుడ్ మార్కెట్ నుంచి వైరస్ వ్యాపిస్తోందని గుర్తించిన అధికారులు, ఆ ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ చేయడానికి పరుగులు పెట్టారు. బుధవారం నాడు నగరంలో 31 కొత్త కేసులు నమోదయ్యాయి. బీజింగ్ పౌరులు నగరాన్ని విడిచి వెళ్లరాదన్న ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు అంటున్నారు.

ఇక, తాజాగా వెలుగులోకి వచ్చిన క్సిన్ ఫాడీ హోల్ సేల్ ఫుడ్ మార్కెట్ వైరస్ క్లస్టర్ తో వేల కొద్దీ ప్రజలకు సంబంధముందని గుర్తించిన అధికారులు, 30 రెడిడెన్షియల్ కాంపౌండ్లలో లాక్ డౌన్ విధించారు. మీడియం లేదా హై రిస్క్ ఉన్న ప్రాంతాల ప్రజలను ఎటూ కదలనీయకుండా ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఎవరైనా బీజింగ్ వదిలి వెళ్లాలనుకుంటే, న్యూక్లిక్ యాసిడ్ పరీక్షను తప్పనిసరి చేశారు. బీజింగ్ నుంచి ఇతర ప్రాంతాలకు ఎవరైనా వెళితే, వారిని క్వారంటైన్ చేస్తున్నారు. ఇటీవల తెరచుకున్న పాఠశాలలను తక్షణమే మూసివేసి, ఆన్ లైన్ ద్వారా క్లాసులు చెప్పుకోవాలని అధికారులు ఆదేశించారు.

వైరస్ వ్యాప్తి రాజధానిలో తీవ్రంగా ఉందని బీజింగ్ అధికార ప్రతినిధి క్సూ హిజియన్ వెల్లడించారు. 11 మార్కెట్లను మూసివేశామని, వేలకొద్దీ దుకాణాలను శానిటైజ్ చేశామని తెలిపారు. కాగా, గత ఆరు రోజుల్లో నగరంలో 137 కేసులు వచ్చాయని మునిసిపల్ హెల్త్ కమిషన్ పేర్కొంది.
China
Bejing
Corona Virus
Flights
Cancel

More Telugu News