Kriti Sanon: నీలోని గాయాన్ని నేను నయం చేయాల్సింది.. కానీ చేయలేకపోయా: సుశాంత్ మరణంపై కృతి సనన్ ఆవేదన

Kriti Sanon emotional post on Sushant Singh Rajput tragic demise
  • సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై కృతి తీవ్ర విచారం
  • గతంలో కృతి, సుశాంత్ మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టు కథనాలు
  • నీకోసం ఎప్పటికీ ప్రార్థిస్తూనే ఉంటాను అంటూ కృతి పోస్టు
ఎంఎస్ ధోనీ చిత్రంతో ఆలిండియా ఫేమ్ సంపాదించుకున్న యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనూహ్యరీతిలో ఆత్మహత్యకు పాల్పడడం బాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై హీరోయిన్ కృతి సనన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒకప్పుడు కృతి, సుశాంత్ ల మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని ఎన్నో కథనాలు వచ్చాయి.

సుశాంత్ ఆత్మహత్యపై కృతి స్పందిస్తూ, "నీకున్న అద్భుతమైన మేధస్సు నీ నేస్తం, నీ బద్ధ శత్రువు కూడా. బతకడం కంటే చచ్చిపోవడమే మేలు అనుకునేలా నీ జీవితంలో కొన్ని క్షణాలు ఉన్నాయని తెలియడం కలచివేస్తోంది. నీలోని గాయాన్ని నేను నయం చేయాల్సింది... కానీ అలా చేయలేకపోయాను.  ఇప్పుడు నా హృదయంలో ఓ భాగం నీతోనే వెళ్లిపోయింది. మరో భాగంలో నువ్వెప్పుడూ సజీవంగానే ఉంటావు. నీ సంతోషం కోసం ప్రార్థించడం ఎప్పటికీ ఆపను. ఆపలేను కూడా" అంటూ తీవ్ర భావోద్వేగాలతో ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.
Kriti Sanon
Sushant Singh Rajput
Instagram
Emotional
Post
Bollywood

More Telugu News