Sushant Singh Rajput: సుశాంత్ 6 నెలల్లో 7 సినిమాలను కోల్పోయాడు.. బాలీవుడ్ క్రూరత్వం మరింత పెరిగింది: సంజయ్ నిరుపమ్

Sushant Singh Rajput Lost 7 Films In 6 Months After Chhichhore Alleges Sanjay Nirupam
  • సుశాంత్ ఆత్మహత్య తర్వాత నోరు విప్పుతున్న పలువురు ప్రముఖులు
  • కావాలనే సుశాంత్ ను సినిమాల నుంచి తప్పించారన్న సంజయ్
  • మంచి నటుడిని బాలీవుడ్ బలిగొందని విమర్శ
హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత... బాలీవుడ్ లోని అంతర్గత వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిన్ను దారుణంగా హింసించిన వారి గురించి నాకు బాగా తెలుసు అంటూ సుశాంత్ ను ఉద్దేశించి డైరెక్టర్ శేఖర్ కపూర్ ఆవేదనాభరితంగా చేసిన ట్వీట్ ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. ఇదే క్రమంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఇండస్ట్రీలోని చీకటి కోణాలను బయటపెడుతున్నారు.

సుశాంత్ మరణంపై రాజకీయ నాయకుడు సంజయ్ నిరుపమ్ కూడా సంచలన ఆరోపణలు చేశారు. 2019లో 'చిచోరే' సినిమా హిట్ అయిన తర్వాత సుశాంత్ సింగ్ ఆరు సినిమాలకు సైన్ చేశాడని... అయితే కావాలనే ఆ సినిమాల నుంచి సుశాంత్ ను తప్పించేశారని చెప్పారు. దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు. హిందీ సినీ పరిశ్రమలోని క్రూరత్వం మరో స్థాయికి చేరుకుందని... ప్రతిభ కలిగిన యువ నటుడిని బలిగొందని మండిపడ్డారు.
Sushant Singh Rajput
Sanjay Nirupam
Bollywood

More Telugu News