Pawan Kalyan: ఆహా ఏం తెలివి! అసెంబ్లీ సమావేశాలకు అడ్డొచ్చిన కరోనా టెన్త్ పరీక్షలకు ఇబ్బంది కలిగించదట!: పవన్ కల్యాణ్

Pawan questions government decision to conduct tenth class exams amidst corona scare
  • జూలైలో టెన్త్ పరీక్షలు
  • విద్యార్థులకు ఓటు హక్కు లేదనే ఈ నిర్ణయం తీసుకున్నారన్న పవన్
  • ఏపీలో కేవలం రెండ్రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు
  • కరోనా సాకుతో కుదించారని పవన్ వ్యాఖ్యలు
జనసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరోనా సాకుతో వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను రెండ్రోజులకు కుదించిందని, కానీ, అదే సర్కారు పదో తరగతి పరీక్షలకు ఎలాంటి ఆటంకం లేదని ప్రకటించిందని తెలిపారు. ఈ ప్రభుత్వం ఎంతో తెలివైనదని ట్వీట్ చేశారు. టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఓటు హక్కు ఉండదన్న విషయం తెలుసు కాబట్టే కరోనా రోజుల్లోనూ పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. అంతేకాదు, 'పదో తరగతి విద్యార్థుల ప్రాణాలు కూడా విలువైనవే' అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు. జూలైలో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ సర్కారు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
Pawan Kalyan
Tenth Class Exams
AP Assembly Session
Corona Virus
YSRCP
Andhra Pradesh

More Telugu News