Sushant Singh Rajput: సుశాంత్... నిన్ను దారుణంగా హింసించిన వారి గురించి నాకు తెలుసు: బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్

Sushant I knew  the story of people who let you down tweets Shekhar Kapur
  • నీవు పడిన ఆవేదన నాకు తెలుసు
  • నా భుజాలపై తల పెట్టుకుని కన్నీరు కార్చావు
  • నీవు నా దగ్గరకు వచ్చుంటే బాగుండేది
హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఎంతటి సంచలనాన్ని రేకెత్తించిందో... అంతే స్థాయిలో బాలీవుడ్ లోని చీకటి కోణాలను కూడా బయటపెడుతోంది. అందమైన రంగుల ప్రపంచం వెనకున్న అసలైన రంగులను పలువురు సెలబ్రిటీలు నిర్మొహమాటంగా బయటపెడుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

'నీవు పడిన ఆవేదన నాకు తెలుసు సుశాంత్. నిన్ను దారుణంగా హింసించిన వారి చరిత్ర కూడా తెలుసు. నా భుజాలపై తల పెట్టుకుని నీవు కన్నీరు పెట్టుకున్నావు. ఈ ఆరు నెలల్లో నేను నీ దగ్గర ఉంటే బాగుండేది. లేదా నీవు నా వద్దకు వచ్చినా బాగుండేది. నీకు ఇలా జరగడం వాళ్ల ఖర్మ' అని శేఖర్ కపూర్ ట్వీట్ చేశారు.

గతంలో సుశాంత్ తో కలిసి శేఖర్ కపూర్ 'పానీ' అనే సినిమా తీయాలనుకున్నారు. ఈ సినిమాను ప్రముఖ యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించాల్సి ఉంది. అయితే, ఏ కారణం వల్లో ఆ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ తీయలేదు. ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.
Sushant Singh Rajput
Sekhar Kapoor
Bollywood

More Telugu News