sanchayita: మూడులాంతర్ల స్తూపాన్ని తిరిగి అదే ప్రాంతంలో నిలబెట్టాం: వీడియో పోస్ట్ చేసిన సంచయిత గజపతిరాజు

sanchayita fires on tdp
  • మూడు లాంతర్ల స్తూపాన్ని కూల్చేశారన్నారు
  • అశోక్‌ గజపతి రాజు, చంద్రబాబు విష ప్రచారం చేశారు
  • నిజాలు వారివైపు లేనప్పుడు వాళ్లు ఇలానే ప్రవర్తిస్తారు
  • అంతిమంగా గెలిచేది సత్యమే
టీడీపీ నేతలపై అశోక్ గజపతిరాజు సోదరుడి కుమార్తె, మాన్సాస్ ట్రస్ట్ అధ్యక్షురాలు సంచయిత గజపతిరాజు విమర్శలు గుప్పించారు. 'మూడు లాంతర్ల స్తూపాన్ని కూల్చేశారంటూ అశోక్‌ గజపతి రాజు గారు, చంద్రబాబు గారు విష ప్రచారం చేశారు. నిజాలు వారివైపు లేనప్పుడు వాళ్లు ఇలానే ప్రవర్తిస్తారు. ఇప్పుడు అదే మూడులాంతర్ల స్తూపాన్ని తిరిగి అదే ప్రాంతంలో నిలబెట్టాం' అని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

'పూసపాటి వంశం పేరును అశోక్‌ గజపతి రాజు గారు కేవలం రాజకీయాలకు మాత్రమే వాడుకుంటారు. వారసత్వపు హక్కులకోసం పోరాడుతున్న ఒక యువతిపైన తాను దాడిచేయడమే కాదు.. టీడీపీతోనూ చేయిస్తున్నారు. అయినా అంతిమంగా గెలిచేది సత్యమే' అని సంచయిత చెప్పారు.
sanchayita
YSRCP
Telugudesam

More Telugu News