Kinjarapu Acchamnaidu: బీఏసీకి అచ్చెన్నాయుడి స్థానంలో రామానాయుడు!

Nimmala Ramanaidu Attended BAC for Telugudesham
  • ప్రారంభమైన ఏపీ బీఏసీ మీటింగ్
  • టీడీపీ ఉపనేతగా ఉన్న నిమ్మల రామానాయుడు
  • కనీసం 15 రోజులు సభ జరపాలంటున్న టీడీపీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏఏ సమస్యలపై చర్చించాలి? అన్న అంశాలపై స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బిజినెస్ అడ్వయిజరీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగా, తెలుగుదేశం పార్టీ తరఫున నిమ్మల రామానాయుడు హాజరయ్యారు.

గత అసెంబ్లీ సమావేశాల్లో బీఏసీ సమావేశాలకు టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న అచ్చెన్నాయుడు హాజరైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టయి, రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో, మరో ఉపనేత నిమ్మలను బీఏసీకి వెళ్లి, టీడీపీ వాదన వినిపించాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఆయన బీఏసీ సమావేశానికి వచ్చారు. కాగా, ఈ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
Kinjarapu Acchamnaidu
Nimmala Ramanaidu
Andhra Pradesh
AP Assembly Session

More Telugu News