Chandrababu: గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసిన తెలుగుదేశం!

TDP Boycot Governor Speach
  • నల్ల చొక్కాలతో అసెంబ్లీకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు
  • విపక్షం గొంతు నొక్కుతున్నారన్న చంద్రబాబు
  • కేవలం బిల్లుల ఆమోదం కోసమే అసెంబ్లీ
  • తీవ్రంగా మండిపడిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో విపక్షం గొంతు నొక్కేస్తున్నారని, తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపిస్తూ, ఈ ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగాన్ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. ఉదయం నల్ల చొక్కాలను ధరించి అసెంబ్లీకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత, జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు.

గడచిన ఏడాది కాలంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ఎక్కడా ఏ పనులూ జరగడం లేదని, సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని చెబుతూ, ఈ ప్రభుత్వం భూ కుంభకోణాలకు పాల్పడుతోందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రస్తుత అసెంబ్లీ కేవలం బిల్లులను ఆమోదించుకునేందుకు మాత్రమే సమావేశమవుతోందని, ప్రజా సమస్యలను చర్చించాలన్న చిత్తశుద్ధి జగన్ సర్కారుకు లేదని మండిపడ్డారు.

ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభను, గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేస్తున్నామని ఆయన తెలిపారు. నేడు సభకు ఇతర టీడీపీ సభ్యులంతా నల్ల చొక్కాలను ధరించే రావడం గమనార్హం.
Chandrababu
AP Assembly Session
Andhra Pradesh Assembly
Telugudesam

More Telugu News