AP Assembly Session: ఈ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం: నల్లచొక్కాలతో అసెంబ్లీకి వచ్చిన టీడీపీ సభ్యులు

ap assembly meetings
  • ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై ప్రశ్నిస్తాం
  • ఏపీలో ల్యాండ్‌, శాండ్‌ మాఫియాలపై నిలదీస్తాం
  • బడ్జెట్‌ను ఆమోదించుకోవడం కోసమే ఈ సమావేశాలు 
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ నేతలు నల్లచొక్కాలు ధరించి హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు మీడియాకు చెప్పారు.

గతంలో అడ్డుకున్న బిల్లులను మరోసారి ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఏపీలో ల్యాండ్‌, శాండ్‌ మాఫియాలపై నిలదీస్తామని తెలిపారు. కేవలం బడ్జెట్‌ను ఆమోదించుకోవడం కోసమే ఈ సమావేశాలు జరపాలని ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోందని అన్నారు.

ఏడాది కాలంలో రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులు ముందుకు కదలలేదని విమర్శించారు. కరోనా నేపథ్యంలో బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన కందిపప్పును కూడా కొనుగోలు చేయలేకపోతోందని చెప్పారు.
AP Assembly Session
Andhra Pradesh
Telugudesam

More Telugu News