Varalakshmi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Varalakshmi opposite Raviteja in Crack movie
  • రవితేజ సరసన కథానాయికగా వరలక్ష్మి
  • 'బంగార్రాజు' కోసం పాటల కంపోజిషన్
  • 'క్రష్' షూటింగ్ చేస్తున్న రవిబాబు  
*  పలు చిత్రాలలో లేడీ విలన్ పాత్రలలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా రవితేజ సరసన కథానాయికగా నటిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందుతున్న 'క్రాక్' సినిమాలో రెండో కథానాయికగా వరలక్ష్మి నటిస్తోంది.
*  అక్కినేని నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందే 'బంగార్రాజు' చిత్రం కోసం మ్యూజిక్ కంపోజిషన్స్ జరుగుతున్నాయి. జూమ్ యాప్ ద్వారా దర్శకుడు కల్యాణ్ కృష్ణ, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సిటింగ్స్ లో పాల్గొంటున్నారు. కాగా, షూటింగును అక్టోబర్లో ప్రారంభిస్తారు.  
*  నటుడు, దర్శకుడు రవిబాబు రూపొందిస్తున్న 'క్రష్' చిత్రం షూటింగ్ హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది. కేవలం 29 మంది యూనిట్ సభ్యులతో ప్రభుత్వ నియమ నిబంధనలను పక్కాగా పాటిస్తూ షూటింగ్ చేస్తున్నామని రవిబాబు చెప్పారు.
Varalakshmi
Raviteja
Nagarjuna
Ravibabu

More Telugu News