TRS: మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కూడా కరోనా పాజిటివ్!

TRS MLA Bigala Ganesh Gupta tests corona positive
  • తెలంగాణలో భారీగా విస్తరిస్తున్న కరోనా
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాకు కరోనా పాజిటివ్
  • ఇప్పటికే దీని బారిన పడ్డ ముత్తిరెడ్డి, బాజిరెడ్డి
తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సామాన్యులనే కాకుండా రాజకీయ ప్రముఖులను కూడా వణికిస్తోంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా దీని బారిన పడుతున్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తొలుత దీని బారిన పడ్డారు. ఆ తర్వాత మరో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కరోనా పాజిటివ్ అని నిన్న నిర్ధారణ అయింది. తాజాగా ఈరోజు మరో కలకలం చెలరేగింది. మరో ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు కూడా కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.

హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో గణేశ్ గుప్తా వైద్య పరీక్షలు చేయించుకోగా... కరోనా పాజిటివ్ అని తేలింది. అదే ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ముత్తిరెడ్డిని కలవడం వల్లే ఆయనకు కరోనా సోకి ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు, ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను కలిసిన అధికారులు, నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
TRS
MLA
Bigala Ganesh Gupta
Corona Virus

More Telugu News