Atchannaidu: అచ్చెన్నాయుడుకు బెయిల్ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్

Lawyers files petition in ACB Court seeking bail for Atchannaidu
  • ఈఎస్ఐ కొనుగోళ్ల వ్యవహారంలో అచ్చెన్నాయుడు అరెస్ట్
  • గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న అచ్చెన్న
  • ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలంటూ మరో పిటిషన్
ఈఎస్ఐ కొనుగోళ్ల వ్యవహారంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఆయన ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. కాగా, అచ్చెన్నాయుడుకు బెయిల్ కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా, మెరుగైన చికిత్స కోసం ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలంటూ మరో పిటిషన్ కూడా వేశారు. ఈ రెండు పిటిషన్లపై త్వరలోనే విచారణ జరగనుంది.
Atchannaidu
Bail
ESI Scam
ACB
Court
Andhra Pradesh

More Telugu News