Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్, హీరోయిన్ రియాను విచారించనున్న పోలీసులు

Sushant Singh Rajput Girlfriend Rhea Chakraborty to be Questioned by Police in His Suicide Case
  • బాలీవుడ్ నటి రియాతో సుశాంత్ కు రిలేషన్ షిప్ ఉన్నట్టు వార్తలు
  • సూసైడ్ తర్వాత వైరల్ అయిన సుశాంత్, రియా ఫొటో
  • ఇద్దరి అనుబంధంపై విచారించనున్న పోలీసులు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకున్నాడనే వార్తలు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఆయన మృతి చెందిన ప్రాంతంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరక్కపోవడంతో... ఎందుకు సూసైడ్ చేసుకున్నాడనేది అంతుపట్టని విషయంగా మారిపోయింది. ఆయన ఆత్మహత్యకు కారణం ఏమై ఉంటుందా? అంటూ ఎవరికి తోచిన రీతిలో వారు ఆలోచించడం మొదలుపెట్టారు.

మరోవైపు, సుశాంత్ సూసైడ్ వార్త బయటకు పొక్కగానే... పలువురి మదిలో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి మెదిలింది. సుశాంత్ తో రియా కలిసిన ఉన్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మార్చ్ 11న ఫొటో తీసినట్టు  తెలుస్తోంది. ముంబైలోని ఓ జిమ్ వెలుపల ఈ ఫొటోను తీశారు. వీరిద్దరికీ సంబంధించి ఇదే చివరి ఫొటో అని భావిస్తున్నారు.

మరోవైపు వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారనే వార్తలు గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రియాను విచారించేందుకు ముంబై పోలీసులు  సిద్ధమవుతున్నారు. ఇద్దరి మధ్య ఉన్న సంబంధంపై విచారణలో ప్రశ్నించనున్నారు. మరోవైపు, ఉరి వేసుకోవడం వల్లే సుశాంత్ చనిపోయాడని పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో వెల్లడైంది. ఊపిరి ఆడకపోవడం (asphyxia) వల్లే ప్రాణాలు కోల్పోయాడని తేలింది.  
సుశాంత్ సింగ్, రియా చక్రవర్తిల చివరి ఫొటో

 

Sushant Singh Rajput
Girlfriend
Rhea Chakraborty
Last Photo
Bollywood

More Telugu News