Bonda Uma: జూన్ 22 లోపు నన్ను చంపుతామని డెడ్ లైన్ పెట్టారు... ఏదైనా జరిగితే సీఎం జగన్ దే బాధ్యత: బోండా ఉమ

  • టీడీపీ నేతల హత్యలకు ప్రణాళిక రచించారన్న ఉమ
  • తనతో పాటు కొందరికి బెదిరింపు కాల్స్ వస్తున్నట్టు వెల్లడి
  • లొంగితే వైసీపీ కండువా, లొంగకపోతే అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం
టీడీపీ నేత బోండా ఉమ తాజా పరిణామాలపై స్పందించారు. కొంతమంది టీడీపీ నాయకులను హత్య చేయడానికి ప్రణాళిక రచించారని తీవ్ర ఆరోపణలు చేశారు. జూన్ 22 లోపు తనను చంపుతామని డెడ్ లైన్ పెట్టారని వెల్లడించారు.  తనతో పాటు మరికొందరికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. టీడీపీ నేతల ప్రాణాలకు హాని జరిగితే సీఎం జగన్ దే బాధ్యత అని స్పష్టం చేశారు.

బెదిరింపులకు లొంగితే వైసీపీ కండువా కప్పుతున్నారని, లొంగకపోతే అరెస్ట్ చేస్తున్నారని బోండా ఉమ మండిపడ్డారు. సీఎం జగన్ మాట వింటే అధికారులు జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేశారు. ఈఎస్ఐ స్కాంలో తెలంగాణలో అధికారులపై చర్యలు తీసుకున్నారు కానీ, మంత్రిపై కాదని అన్నారు. ఈఎస్ఐ కొనుగోళ్లలో మంత్రికి సంబంధం ఉండదని కేంద్రం 2009లోనే చెప్పిందని ఉమ గుర్తు చేశారు.
Bonda Uma
Telugudesam
Jagan
YSRCP
Atchannaidu
Andhra Pradesh

More Telugu News