Sushant Singh Rajput: న‌వంబ‌రులో సుశాంత్‌కు పెళ్లి.. ఇంతలో ఇలా జరిగింది : కుటుంబ స‌భ్యుల వెల్ల‌డి

Sushanth Singhs marriage is in November reveals family member
  • సూసైడ్ చేసుకుని తనువు చాలించిన సుశాంత్
  • షాక్ లో మునిగిపోయిన చిత్ర పరిశ్రమ
  • డిప్రెషన్ తో బాధ పడుతున్నాడన్న పోలీసులు
బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో భారతీయ సినీ పరిశ్రమ మొత్తం షాక్ లో మునిగిపోయింది. సక్సెస్ పుల్ హీరోగా కొనసాగుతూ, ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్న సుశాంత్ బలవన్మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సూసైడ్ చేసుకోవాల్సినంత బాధ అతనిలో ఏముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ ఏడాది నవంబర్ లో సుశాంత్ వివాహం ఉన్నట్టు తెలిసింది. అతని వివాహానికి సన్నాహాలను కూడా ప్రారంభించారు. ఈ విషయాన్ని సుశాంత్ కు వరుసకు సోదరుడయ్యే పన్నా సింగ్ తెలిపాడు. సుశాంత్ కూడా పెళ్లి మూడ్ లో ఉన్నాడని... ఇంతలోనే ఇలా జరిగిందని చెప్పారు. అయితే ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడనే విషయం మాత్రం ఆయన వెల్లడించలేదు. మరోవైపు, సుశాంత్ మరణంతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సుశాంత్ డిప్రెషన్ తో బాధ పడుతున్నాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
Sushant Singh Rajput
Bollywood
Suicide
Marriage

More Telugu News