America: మరోమారు ఉద్రిక్తంగా మారిన అమెరికా.. అట్లాంటా పోలీస్‌ చీఫ్‌ రాజీనామా

Atlanta police chief resigns
  • రెస్టారెంట్ వద్ద నల్లజాతీయుడి కాల్చివేత
  • చెలరేగిన ఆందోళనలు
  • ఓ అధికారి బదిలీ, మరొకరు సస్పెన్షన్ 
నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై అమెరికాలో ఆందోళనలు కొనసాగుతుండగానే, మరో నల్లజాతీయుడి కాల్చివేత అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. ఓ రెస్టారెంట్ ఎదుట వినియోగదారులకు ఇబ్బంది కలిగిస్తున్నాడన్న కారణంతో శుక్రవారం రాత్రి రేసర్డ్ బ్రూక్ అనే నల్లజాతి యువకుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన రేసర్డ్ చికిత్స పొందుతూ మరణించాడు. అతని మృతి వార్త తెలిసిన వెంటనే ఆందోళనలు మొదలయ్యాయి. ఘటన జరిగిన ప్రాంతంలోని వెండీ రెస్టారెంట్‌ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

రేసర్డ్ కాల్చివేత ఘటనపై ఆందోళనలు వెల్లువెత్తడంతో ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అట్లాంటా పోలీస్ చీఫ్ ఎరిక్ షీల్డ్ శనివారం రాజీనామా చేశారు. మరోపక్క, గారెట్ రాల్ఫ్ అనే పోలీసు అధికారిని నిన్న విధుల నుంచి తప్పించారు. మరో అధికారిని కూడా బదిలీ చేశారు. మరోవైపు, ఆందోళనల్లో పాల్గొన్న 36 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్పుల ఘటనపై విచారణకు అధికారులు ఆదేశించారు.
America
Rayshard brooks
atlanta
police chief

More Telugu News