Chandrababu: దివిటీలు చేతబట్టిన చంద్రబాబు తదితరులు... ప్రభుత్వంపై ఆగ్రహం

Chandrabu protests along with his party leaders opposing arrests
  • అక్రమ అరెస్టులు నశించాలంటూ నినాదాలు
  • ట్విట్టర్ లో వీడియో పోస్టు చేసిన చంద్రబాబు
  • ఇది వెలుగునీడల మధ్య పోరాటం అంటూ వ్యాఖ్యలు
తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య, బోండా ఉమ తదితరులు దివిటీలు చేతబట్టి ప్రదర్శన నిర్వహించారు. అక్రమ అరెస్టులు నశించాలని, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు ఎత్తివేయాలని, విపక్షాలపై దాడులు నశించాలని నినాదాలు చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన ఈ ప్రదర్శన తాలూకు వీడియోను చంద్రబాబు ట్విట్టర్ లో పంచుకున్నారు. ఇది చీకటి వెలుగుల మధ్య పోరాటం అని పేర్కొన్నారు. వెలుగు లేనప్పుడే చీకటి రాజ్యమేలుతుందని, మళ్లీ వెలుగు వచ్చి చీకటిని పారదోలుతుందని వివరించారు. కాలమే దీనికి పరిష్కారం చూపుతుందని తెలిపారు.

Chandrababu
Telugudesam
Leaders
Arrests
Andhra Pradesh

More Telugu News