కరోనాతో ధర్మవరం ఎమ్మెల్యే గన్ మన్ మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కరోనాతో ధర్మవరం ఎమ్మెల్యే గన్ మన్ మృతి

Dharmavaram MLA gunman dies of corona
  • ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వద్ద గన్ మన్ గా పనిచేస్తున్న సురేశ్
  • వివక్ష ప్రదర్శిస్తారన్న భావనతో కరోనా పరీక్షలు చేయించుకోని గన్ మన్
  • కేతిరెడ్డి కార్యాలయంలో 8 మందికి కరోనా పాజిటివ్
రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత మరింత పెరుగుతోంది. తాజాగా, అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వద్ద గన్ మన్ గా వ్యవహరిస్తున్న సురేశ్ కరోనా కారణంగా మృత్యువాత పడ్డాడు. కరోనా సోకిన వెంటనే సురేశ్ పరీక్షలు చేయించుకోలేదని, కరోనా వచ్చిందని ఎవరైనా వివక్ష ప్రదర్శిస్తారేమోనని భయపడ్డాడని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెల్లడించారు.

ఎమ్మెల్యే కేతిరెడ్డి సిబ్బందిలో మొత్తం ఎనిమిది మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఇలాంటి విషయాల్లో వెనుకంజ వేస్తే ప్రాణాలకే ప్రమాదం వస్తుందని కేతిరెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దయచేసి ఎవరూ కరోనా రోగుల పట్ల వ్యతిరేకభావం ప్రదర్శించవద్దని ఆయన హితవు పలికారు.
Suresh
Gun Man
Kethireddy Venkatramireddy
Corona Virus
Dharmavaram
Anantapur District

More Telugu News