R Gandhi: ప్రస్తుతం సమాజం ముందున్న అతిపెద్ద సవాలిదే: ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ

  • పెను సమస్యగా మారిన సైబర్ సెక్యూరిటీ
  • పెరిగిన మాల్ వేర్, ట్రోజన్ దాడులు
  • సాఫ్ట్ వేర్ లోపాలను సరిచేయాల్సి వుందన్న ఆర్ గాంధీ
RBI Dy Director R Gandhi Comments on Cyber Attacks

ప్రస్తుత లాక్ ‌డౌన్‌ సమయంలో సైబర్‌ సెక్యూరిటీ అతి పెద్ద సవాలుగా మారిందని రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌ గాంధీ అభిప్రాయపడ్డారు. ఓ సంస్థ ఏర్పాటు చేసిన విబెనార్‌ లో మాట్లాడిన ఆయన, లాక్ ‌డౌన్‌ కారణంగా మాల్ ‌వేర్‌, ట్రోజన్‌ దాడులు గణనీయంగా పెరిగిపోయాయని అన్నారు.

సాఫ్ట్ ‌వేర్ లోపాలను అలుసుగా తీసుకుని నిందితులు సైబర్ దాడులకు పాల్పడుతున్నారని వెల్లడించిన ఆయన, పిల్లలు స్మార్ట్ ఫోన్లలో ఆడుకునే గేములు,  టీవీ కంటెంట్‌ అత్యంత కీలకమైన డేటాను వీరు తస్కరిస్తున్నారని అన్నారు. ఈ తరహా దాడుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాఫ్ట్ వేర్ లోపాలను సరిచేసేందుకు నిపుణులు ప్రయత్నించాలని ఆర్ గాంధీ సూచించారు.

More Telugu News