జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

Two Terrorist dead in an encounter in Jammu and kashmir
  • కొనసాగుతున్న భద్రతా దళాల తనిఖీలు
  • గులాబ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్
  • 15 రోజుల్లో 25 మంది ఉగ్రవాదుల హతం 
జమ్మూకశ్మీర్‌లోని కుల్గం జిల్లా నిపొరా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించగా, గమనించిన ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

మరోవైపు, పుల్వామా జిల్లా త్రాల్ పరిధిలోని గులాబ్ బాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. తనిఖీలు మరిన్ని ప్రాంతాల్లోనూ కొనసాగుతాయని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. కాగా, గత రెండు వారాల్లో 25 మందికి పైగా ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది.
Go Back to Shorts
Jammu And Kashmir
Terrorists
Encounter

More Telugu News