Servers: ఇంటర్ రెండు సంవత్సరాల ఫలితాలు ఒకేసారి వెల్లడి.. చేతులెత్తేసిన సర్వర్లు

Servers downed as Inter both years results were released
  • ఈ సాయంత్రం ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు
  • సర్వర్లు పనిచేయకపోవడంతో వెల్లడి కాని ఫలితాలు
  • విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నిరాశ
ఏపీలో ఇవాళ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏకకాలంలో విడుదల చేశారు. అయితే, సాంకేతిక కారణాలతో సర్వర్లు మొరాయించడంతో విద్యార్థులు ఫలితాలు చూసుకోలేక తీవ్ర నిరాశకు గురయ్యారు. సర్వర్ బిజీ అని, టూ మెనీ హిట్స్ అని సందేశాలు రావడం తప్ప, ఫలితాలు రాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అసహనానికి గురయ్యారు. రెండు సంవత్సరాల ఫలితాలు ఒకేసారి విడుదల చేయడమే సర్వర్ల మొరాయింపుకు కారణం అని భావిస్తున్నారు.
Servers
Inter
Andhra Pradesh
Results

More Telugu News