Vijay Sai Reddy: టీడీపీ అధ్యక్ష పదవికి ఎర్రన్న కుటుంబం పోటీ వస్తోందని అచ్చెన్నను ఇరికించారు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy made allegations over Atchannaidu issue
  • చిట్టినాయుడు దెబ్బ-అచ్చెన్న అబ్బా అంటూ విజయసాయి ట్వీట్
  • చిట్టినాయుడు టీమ్ కీలక పత్రాలు లీక్ చేసిందని ఆరోపణ
  • వాటాలు పంచుకున్నదెవరో అచ్చెన్న వెల్లడించాలన్న విజయసాయి
అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. చిట్టినాయుడు దెబ్బ-అచ్చెన్న అబ్బా అంటూ పోస్టు చేశారు. టీడీపీ అధ్యక్ష పదవికి ఎర్రన్న కుటుంబం పోటీకి వస్తోందని చిట్టినాయుడు టీమ్ కావాలనే రూ.900 కోట్ల మందుల కొనుగోళ్ల స్కాంలో కీలక పత్రాలను లీక్ చేసిందని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేయిస్తారని, ఆపై వాటాలు పంచుకుని, అడ్డొస్తారన్న అనుమానం కలిగితే లీకులిచ్చి ఇరికించేస్తుంటారని విజయసాయి పేర్కొన్నారు. ఈ స్కాంలో ఎవరెవరు వాటాలు పంచుకున్నారో ఏసీబీకి వెల్లడించాలని పేర్కొన్నారు.
Vijay Sai Reddy
Atchannaidu
Arrest
ACB
Telugudesam
Andhra Pradesh

More Telugu News