Revanth Reddy: 'కొండపోచమ్మ కథలు' అంటూ రేవంత్ రెడ్డి విమర్శలు

  • ఇటీవలే కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభం
  • కాలువకు గండిపడిన వీడియో పోస్టు చేసిన రేవంత్
  • నకిలీ భగీరథుడి నిర్వాకం అంటూ వ్యాఖ్యలు
Revanth Reddy criticises TRS government over Kondapochamma Sagar

ఇటీవలే టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభించింది. అయితే, ప్రాజెక్టు ప్రారంభించిన కొన్నాళ్లకే లోపాలు బట్టబయలయ్యాయంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఈ మేరకు కాలువలకు గండి పడి నీళ్లు బయటికి వెళ్లిపోతున్న దృశ్యాలతో కూడిన వీడియోను ట్వీట్ చేశారు. కొండపోచమ్మ కథలు అంటూ విమర్శలు చేశారు. ఇది ఓ నకిలీ భగీరథుడి నిర్వాకం అని, కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందని ఎద్దేవా చేశారు. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో మెగా మేత ఘనత తేటతెల్లమైందని, అవినీతి కట్టల ఫలితం కట్టలు తెగి కళ్లముందే పొంగిపొర్లుతోందంటూ వ్యాఖ్యానించారు. 'జాతిజలగ' నిన్నగాక మొన్న ప్రారంభించిన మోటర్ల పరిస్థితి ఇదీ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.


More Telugu News