Devineni Uma: అచ్చెన్నాయుడు అనారోగ్యంతో ఉన్నప్పటికీ అరెస్టు చేశారు: దేవినేని ఉమ

  • శాసనసభలో ఆయన ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నారు
  • తప్పుడు కేసులతో పోలీసులు కిడ్నాప్ చేశారు
  • వైఎస్‌ జగన్ బాధ్యత వహించాలి
  • ఇది బీసీవర్గాలపై దాడి.. రాజకీయ కక్ష సాధింపు కాదా?
devineni fires on ycp

టీడీపీ నేత అచ్చెన్నాయుడి అరెస్టుపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'శాసనసభలో ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్న మా డిప్యూటీ లీడర్ అచ్చెన్నాయుడి గారు అనారోగ్యంతో ఉన్నప్పటికీ తప్పుడు కేసులతో వందలాది మంది పోలీసులు కిడ్నాప్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ బాధ్యత వహించాలి. ఇది బీసీవర్గాలపై దాడి. రాజకీయ కక్ష సాధింపు కాదా?' అని దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు.

బీసీ నాయకుడిని కక్షపూరితంగా అరెస్టు చేశారని కళా వెంకట్రావు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలపై ఏ రాజకీయ పార్టీ అయినా పోరాడుతుందని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని ఆయన చెప్పారు. ఆ మాత్రానికే అరెస్టులు చేయడమేంటని నిలదీశారు. ఒకేసారి వందల మంది ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తారా? అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇటువంటి చర్యలకు వైసీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు.

More Telugu News