Nara Lokesh: బీసీ నేత అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ పగ పట్టారు: నారా లోకేశ్

  • అచ్చెన్నాయుడి గారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను
  • బీసీలకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని ఆయన ప్రశ్నించారు
  • ఆయనపై వ్యక్తిగత దూషణలకు దిగి జగన్ రాక్షసానందం పొందారు
  • జగన్ అందర్నీ జైలులో పెట్టాలనుకోవడం సహజమే
lokesh fires on ycp leaders

తమ పార్టీ నేత అచ్చెన్నాయుడి అరెస్టుపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. 'శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడి గారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కక్ష సాధింపులో భాగంగానే వైఎస్ జగన్.. బీసీ నేత అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయించారు. ఏడాది తుగ్లక్ పాలనలో జరుగుతున్న అరాచకాలను, అన్యాయాలను బయటపెట్టినందుకే అచ్చెన్నాయుడు పై జగన్ పగ పట్టారు' అన్నారు లోకేశ్.

'బీసీలకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించినందుకు ఆయనపై వ్యక్తిగత దూషణలకు దిగి జగన్ రాక్షస ఆనందం పొందారు. రూ.లక్ష కోట్లు కొట్టేసి 16 నెలలు ఊచలు లెక్కపెట్టిన జగన్ అందర్నీ జైలులో పెట్టాలనుకోవడం సహజమే' అని ట్వీట్లు చేశారు.

'రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉంది, ఇష్టం వచ్చినట్టు ఎవరినైనా అరెస్ట్ చేస్తానని జగన్ గారు అనుకుంటున్నారు. బడుగు, బలహీన వర్గాలకి రక్షణగా అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉందనే విషయం జగన్ గారు గుర్తెరిగితే మంచిది' అని అన్నారు.

More Telugu News