Andhra University: కేంద్రం ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రా యూనివర్సిటీకి 36వ స్థానం

Andhra University gets thirty sixth position in HRD rankings
  • జాతీయస్థాయి ర్యాంకులు ప్రకటించిన మానవ వనరుల శాఖ
  • టాప్ వర్సిటీగా బెంగళూరు ఐఐఎస్సీ
  • ఇంజినీరింగ్ విభాగంలో మద్రాస్ ఐఐటీ అగ్రస్థానం పదిలం
ఏపీలో ఎంతో ఘనచరిత్ర ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఆంధ్రా యూనివర్సిటీ ఒకటి. కానీ జాతీయస్థాయికి వచ్చేసరికి ర్యాంకుల్లో ఎక్కడో నిలిచింది. తాజాగా, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రా వర్సిటీకి 36వ స్థానం లభించింది.

యూనివర్సిటీల విభాగంలో ప్రకటించిన ఈ ర్యాంకుల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 15వ ర్యాంకు దక్కగా, కేఎల్ యూనివర్సిటీ 70వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో నెంబర్ వన్ గా బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో జేఎన్ యూ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఉన్నాయి.

ఇక, ఇంజినీరింగ్ విద్యలో చూస్తే.... ఐఐటీ మద్రాస్ కు ఎదురులేకుండా పోయింది. ఈ ఏడాది కూడా నెంబర్ వన్ పీఠాన్ని చేజిక్కించుకుంది. ఐఐటీ హైదరాబాదు ఈ జాబితాలో 17వ ర్యాంకుతో సరిపెట్టుకుంది.
Andhra University
IIT Madras
Bengaluru IISC
HRD
HCU

More Telugu News