నవాజ్ షరీఫ్ సోదరుడికి కరోనా పాజిటివ్.. ఇమ్రాన్ ఖానే కారణమంటూ పార్టీ ఫైర్
- కరోనా బారిన పడుతున్న పాక్ టాప్ పొలిటీషియన్లు
- ఇప్పటికే నలుగురు ప్రజాప్రతినిధుల మృతి
- 1,19,536కి చేరుకున్న కరోనా కేసుల సంఖ్య
షెహ్బాజ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని, ఆయన రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉందని కోర్టుకు పలు మార్లు విన్నవించామని... అయినా విచారణకు పిలిపించారని తరార్ అన్నారు. దీనికంతటికీ ప్రధాని ఇమ్రాన్ ఖానే కారణమని మండిపడ్డారు.
పాకిస్థాన్ లో కరోనా కేసుల సంఖ్య 1,19,536కి చేరుకుంది. మొత్తం మృతుల సంఖ్య 2,356కు పెరిగింది. మృతుల్లో ఒక మంత్రి సహా నలుగురు ప్రజాప్రతినిధులు కూడా ఉండటం గమనార్హం.