Corona Virus: ప్రపంచ వ్యాప్తంగా భారీగా పెరిగిన కరోనా కేసులు.. బ్రెజిల్‌లో ఒక్కరోజులో ఏకంగా 32,913 మందికి సోకిన వైనం

  • మొత్తం 74,61,000 మందికి కరోనా
  • 4,19,000 మంది మృతి
  • అమెరికాలో 24 గంటల్లో 20,850 కేసులు
  • బ్రెజిల్‌లో మొత్తం 7,72,416 మందికి కరోనా
coronavirus cases in the world

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు అతి భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 74,61,000 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. 4,19,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 24 గంటల్లో 20,850 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,066,500కు చేరింది.

ఆ తర్వాత బ్రెజిల్‌లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తమ దేశంలో 7,72,416 మందికి కరోనా సోకిందని బ్రెజిల్ ప్రభుత్వం ప్రకటించింది. 24 గంటల్లో ఆ దేశంలో ఏకంగా 32,913 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లో మరో 1,274 మంది మృతి చెందడంతో మృతుల సంఖ్య మొత్తం 39,680కి చేరింది. మృతుల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశాల్లో బ్రెజిల్ మూడో స్థానంలో ఉంది.

అమెరికా తర్వాత రష్యాలో అత్యధికంగా 4,93,600 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 8,404 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 6,358కి చేరింది. యూకేలో 2,90,143 మందికి కరోనా సోకగా 41,128 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో 2,89,300 మంది కొవిడ్ బారిన పడగా 27,136 మంది ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News