Ramcharan: గతంలో దిగిన ఫొటోలు పోస్ట్ చేసి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్‌ చరణ్‌

Right now going with the flow and hoping that things get back to normal
  • హరిద్వార్‌లో ఈ ఫొటోలు దిగాను
  • ప్రస్తుత పరిస్థితుల్లో విశ్రాంతి తీసుకుంటున్నాను
  • పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని భావిస్తున్నాను
కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన నిబంధనల్లో భాగంగా సినిమా షూటింగులను బంద్‌ చేసిన నేపథ్యంలో ఇంట్లోనే ఉంటోన్న సినీనటులు గతంలో తాము తీసుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఈ సమయాన్ని హాయిగా గడుపుతున్నారు. గతంలో హరిద్వార్‌లో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేసిన టాలీవుడ్ హీరో రామ్ చరణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
                       
'గతంలో హరిద్వార్‌లో తీసుకున్న ఫొటో ఇది. ప్రస్తుతం మనం పరిస్థితులకు తగ్గట్టుగా మసలుకోవడమే. మళ్లీ పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నాను. సురక్షితంగా ఉండండి' అని చెర్రీ ట్వీట్ చేశాడు.
Ramcharan
Twitter
Tollywood

More Telugu News