YSRCP: ఇక కిమ్ జాంగ్ ఉన్ వంటి నేతలతోనే చినబాబు డీల్: విజయసాయి రెడ్డి

Vijaya Sai Reddy Setires on Chandrababu
  • ప్రజలకు దూరమైన చినబాబు
  • పార్టీకి అంతర్జాతీయ అధ్యక్షుడిని చేయాలనుకుంటున్న చంద్రబాబు
  • ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ సెటైర్లు
తెలుగుదేశం పార్టీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా చినబాబును చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని, ఇక కిమ్ జాంగ్ ఉన్ వంటి నేతలతో వ్యవహారాలు నడిపేలా చూడాలన్న నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టిన ఆయన, "తెలుగు ప్రజలతో చినబాబు సంబంధాలు పెట్టుకోలేకపోతున్నారు. ఔట్ రైట్ గా ప్రజలంతా ఆయనను తిరస్కరించారు. ఇక కిమ్ జాంగ్ ఉన్ తదితర నేతలతో వ్యవహారాలు నడపడానికి చంద్రబాబు ఆయన్ను తెలుగుదేశం పార్టీకి అంతర్జాతీయ అధ్యక్షుడిగా చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది" అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
YSRCP
Chandrababu
Nara Lokesh
Vijayasai Reddy

More Telugu News