Chandrababu: "జగన్ తన సొంత 'రాజారెడ్డి రాజ్యాంగం' అమలు చేస్తున్నారు" అంటూ ఏపీ ప్రజలకు చంద్రబాబు లేఖ
- ప్రస్తుత పరిణామాలను చూస్తే అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంది
- దేశ చరిత్రలోనే ఇంతటి రాక్షసపాలన ఏ ప్రభుత్వమూ చేయలేదు
- ఏడాదిగా రాష్ట్రంలో పరిణామాలు ఆందోళనకరం
- వైసీపీ నేతల దుర్మార్గాలతో రాష్ట్రానికి కీడు
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రజలకు ఆయన బహిరంగ లేఖరాసి పలు విషయాలు తెలిపారు. 'దేశమంతా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలుచేస్తోంటే, ఏపీలో మాత్రం వైఎస్ జగన్ తన సొంత 'రాజారెడ్డి రాజ్యాంగం' అమలు చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలను చూస్తే అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంది. దేశ చరిత్రలోనే ఇంతటి రాక్షసపాలన, విధ్వంసకాండ ఏ ప్రభుత్వమూ చేయలేదు' అని ఆయన విమర్శించారు. ఏడాదిగా రాష్ట్రంలో పరిణామాలు ఆందోళనకరంగా మారాయన్నారు. వైసీపీ నేతల దుర్మార్గాలతో రాష్ట్రానికి కీడు, ప్రజలకు చేటు ఏర్పడిందని, వీటిని తెలియజేసేందుకే తాను ఈ బహిరంగలేఖను రాస్తున్నానని ఆయన చెప్పారు.