Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • సోషల్ మీడియాలో అనుష్క కొత్త రికార్డు 
  • హిందీలో పూరి మరో రెండు సినిమాలు
  • మహేశ్ కు విలన్ గా కన్నడ స్టార్
Anushka gets Twenty million followers on Facebook

*  అందాలతార అనుష్క సోషల్ మీడియాలో రికార్డు కొట్టింది. తన ఫేస్ బుక్ అకౌంటులో 20 మిలియన్ల ఫాలోవర్స్ ను దాటేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఆనందంతో అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేసింది.
*  పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమాను చేస్తున్న సంగతి విదితమే. దీని తర్వాత హిందీలో ఇద్దరు స్టార్ హీరోలతో మరో రెండు సినిమాలు చేస్తాడట. కరణ్ జొహార్ తో కలసి ఈ చిత్రాలను ప్లాన్ చేస్తున్నాడు.
*  మహేశ్ హీరోగా పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో విలన్ పాత్రకు గాను కన్నడ స్టార్ సుధీర్ ను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ నుంచి జరుగుతుంది.

More Telugu News