Hyderabad: హైదరాబాదులో పలు ప్రాంతాలలో భారీ వర్షం

  • తడిసి ముద్దైన జంటనగరాలు 
  • గంట సేపు ఆగకుండా కురిసిన వర్షం
  • రాగల గంటల్లో కూడా వర్షం కురిసే అవకాశం
Heavy rain in Hyderabad

ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో జంటనగరాలు తడిసి ముద్దయ్యాయి. ఈ సాయంత్రం నగరం పూర్తిగా మేఘావృతమైంది. దట్టమైన మేఘాలు కమ్మేయడంతో పట్టపగలే చీకటిని తలపించింది. ఆ వెంటనే ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం నగరాన్ని ముంచెత్తింది. దాదాపు గంటసేపు ఆగకుండా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి, ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

బంజారాహిల్స్, మెహిదీపట్నం, లంగర్ హౌస్, కోఠి, అబిడ్స్, మూసాపేట, జీడిమెట్ల, నల్లకుంట, అంబర్ పేట, నాచారం, కాచిగూడ, పటాన్ చెరు, బోయిన్ పల్లి, చిలకలగూడ, మారేడ్ పల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రానున్న గంటల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

More Telugu News