Balakrishna: బాలకృష్ణకు కేక్ తినిపిస్తున్న చంద్రబాబు, మోక్షజ్ఞ.. బాలయ్య బర్త్ డే ఫొటోలు ఇవిగో!

Chandrababu in Balakrishna birthday celebrations
  • 60వ పుట్టినరోజును జరుపుకున్న బాలయ్య
  • కుటుంబంతో కలిసి వేడుకలు
  • నిరాడంబరంగా జరిగిన బాలయ్య పుట్టినరోజు వేడుకలు
ఈరోజు నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు జరుపుకున్నారు. తన పుట్టినరోజును ఆయన చాలా నిరాడంబరంగా జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో అభిమానులు కూడా ఎవరి ఇళ్లలో వారే వేడుక జరుపుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా బాలయ్య తెలుగుదనం ఉట్టిపడేలా పట్టు వస్త్రాలను ధరించారు. తొలుత హైదరాబాదులోని బసవతారకం ఆసుపత్రి వద్ద ఉన్న తన తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆసుపత్రిలో బర్త్ డే కేక్ ను కట్ చేశారు.

ఆ తర్వాత తన కుటుంబ సభ్యుల మధ్య బర్త్ డే కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి బావ చంద్రబాబు నాయడు, సోదరి నారా భువనేశ్వరి, భార్య వసుంధర, కుమార్తె బ్రాహ్మణి హాజరయ్యారు. త్వరలో సినీరంగ ప్రవేశం చేయనున్న మోక్షజ్ఞ కూడా వేడుకల్లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Balakrishna
Birthday
Chandrababu
Nandamuri Mokshagna
Telugudesam

More Telugu News