Kanna Lakshminarayana: ఒకే విషయంలో పదే పదే ఇంకెన్ని సార్లు కోర్టుతో మొట్టికాయలు తింటారు?: కన్నా

Dont play with constitutional institutions says Kanna Lakshminarayana
  • ఎస్ఈసీ వ్యవహారంలో ప్రభుత్వ తీరును తప్పుపట్టిన సుప్రీంకోర్టు
  • హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ
  • ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకోమన్న కన్నా
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకోవద్దని సున్నిత వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సెటైర్లు వేశారు.

ఒకే విషయంలో (ఎస్ఈసీ) ఇంకెన్ని సార్లు కోర్టుతో మొట్టికాయలు తింటారని ఆయన ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేశ్ కేసులో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా తప్పును సరిచేసుకోవాలని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలతో గౌరవంగా వ్యవహరించాలని హితవు పలికారు.
Kanna Lakshminarayana
BJP
Nimmagadda Ramesh Kumar
SEC
YSRCP
Supreme Court
AP High Court

More Telugu News