రేవంత్ పై నేను ఎటువంటి చెడు వ్యాఖ్యలూ చేయలేదు!: పోసాని
- రెండు రోజుల క్రితం పోసాని కీలక వ్యాఖ్యలు
- అప్పటి నుంచి మొదలైన ట్రోలింగ్
- రేవంత్ అభిమానులు క్షమించాలన్న పోసాని
రేవంత్ పై తాను ఎటువంటి చెడు వ్యాఖ్యలూ చేయలేదని, రేవంత్ అభిమానులు, కార్యకర్తలు ఎవరైనా బాధపడివుంటే తనను క్షమించాలని అన్నారు. తాను తప్పుచేసుంటే, సరిదిద్దుకుంటానని చెబుతూ, ఓ ప్రకటనను మీడియాకు విడుదల చేశారు.
తన వ్యాఖ్యల ద్వారా రేవంత్ అభిమానులు మనస్తాపం చెందారని తనకు తెలిసిందని, తాను తెలిసి ఈ వ్యాఖ్యలు చేయలేదని, ఆయన్ను రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్నడూ విమర్శించలేదని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు విమర్శించే సమయంలో సంబంధిత సాక్ష్యాలు కూడా ఉంచుకోవాలన్నదే తన ఉద్దేశమని, ఆనాడు కూడా తాను అదే చెప్పానని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై అభిమానులకు విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. ఇక పోసాని వివరణతోనైనా రేవంత్ అభిమానులు శాంతిస్తారేమో చూడాలి.