శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడికి కరోనా... భక్తుల్ని అనుమతించాలన్న నిర్ణయం వాయిదా
ముక్కంటి కొలువై ఉన్న శ్రీకాళహస్తి ఆలయంలో దర్శనాలకు అంతా సిద్ధమైన తరుణంలో ఓ అర్చకుడు కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. మొత్తం 71 మంది ఆలయ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఒక అర్చకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంకా మరికొందరి రిపోర్టులు రావాల్సి ఉంది. దాంతో ఈ నెల 12 నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించాలన్న నిర్ణయం వాయిదా వేశారు. దీనిపై ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, తదుపరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చేవరకు శ్రీకాళహస్తి ఆలయంలోకి భక్తులను అనుమతించబోమని స్పష్టం చేశారు.