Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కు చురకలంటించిన పాకిస్థాన్ సుప్రీంకోర్టు

  • పాకిస్థాన్ లో 1.10 లక్షలు దాటిన కరోనా కేసులు
  • కరోనాను తేలికగా తీసుకోవద్దన్న సుప్రీంకోర్టు
  • ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జిలు కరోనా బారిన పడ్డారన్న చీఫ్ జస్టిస్
Take corona virus seriously says Pakistan Supreme Court to govt

మన దాయాది దేశం పాకిస్థాన్ పై కరోనా వైరస్ పంజా విసిరింది. ఇప్పటికే కేసుల సంఖ్య 1.10 లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో అక్కడి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైరస్ కట్టడి కోసం సరైన చర్యలు తీసుకోవడం లేదని జనాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ప్రభుత్వానికి పాక్ సుప్రీంకోర్టు చురకలంటించింది.

కరోనా వైరస్ ను తేలికగా తీసుకోవద్దని, సీరియస్ గా తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. వైరస్ కట్టడి కోసం తగు చట్టాలను కూడా రూపొందించాలని తెలిపింది. చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జీలు కూడా కరోనా బారిన పడ్డారని, తాము కూడా ఒత్తిడికి లోనవుతున్నామని చెప్పారు. పాక్ ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు.

More Telugu News