RGV: బాలకృష్ణ 'శివశంకరీ..' పాటపై వర్మ వ్యాఖ్యలు

Ram Gopal Varma responds on Balakrishna singing
  • రేపు బాలయ్య పుట్టినరోజు
  • ఫ్యాన్స్ కోసం పాత పాట పాడిన బాలయ్య
  • వావ్ అంటూ స్పందించిన వర్మ
టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులకు కానుకగా అలనాటి హిట్ గీతం శివశంకరి శివానంద లహరి గీతాన్ని మళ్లీ ఆలపించడం తెలిసిందే. దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. "వావ్" అంటూ ఆశ్చర్యం వెలిబుచ్చిన వర్మ "మహ్మద్ రఫీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా దిగదుడుపే. వీళ్లిద్దరూ జూనియర్ సింగర్లు అయిపోయారు. అతని గాత్రం భావోద్వేగ స్వర తంత్రులను మీటుతూ లయబద్ధంగా సాగిపోతూ శ్రోతల హృదయ స్పందన పెంచుతుంది. ఒథెల్లో బల్లాడ్ ను శంకరశాస్త్రి, మొజార్ట్ లతో కలిపితే ఎలా ఉంటుందో అంతటి అందమైన ప్రాకృతిక సంగీతం ఇది" అంటూ ట్విట్టర్ లో వర్ణించారు.
RGV
Balakrishna
Shivananda Lahari
Song
Birthday
Fans

More Telugu News