Diputy Commissioner: ముంబయి బీఎంసీ డిప్యూటీ కమిషనర్ కరోనాతో కన్నుమూత

BMC diputy commissioner dies of corona
  • తన నివాసంలోనే మరణించిన అధికారి
  • ఈ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన వైనం
  • వైద్య బృందం వచ్చేలోపే మృతి
దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబయి మహానగరంలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. తాజాగా బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) డిప్యూటీ కమిషనర్ శిరీష్ దీక్షిత్ కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. శిరీష్ దీక్షిత్ తన నివాసంలోనే మరణించారు. ఆయనలో పెద్దగా లక్షణాలేమీ కనపడకపోగా, ఈ ఉదయం ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురైనట్టు కుటుంబ సభ్యుల కథనం. ఓ వైద్య బృందం వచ్చే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు. కరోనాతోనే మృతి చెందినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ముంబయిలో కరోనా ప్రభావం అత్యంత తీవ్రస్థితిలో ఉంది. ఇప్పటివరకు ఈ నగరంలో 82,968 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,969 మంది మృత్యువాత పడ్డారు.
Diputy Commissioner
BMC
Corona Virus
Death
Mumbai

More Telugu News