Perni Nani: విశాఖలో స్టూడియోలు, ఇళ్లు కట్టుకోవాలని చిత్ర ప్రముఖులను కోరాం: పేర్ని నాని

Perni Nani gives details of Tollywood celebrities meeting with CM Jagan
  • సీఎం జగన్ తో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు
  • షూటింగుల నిర్వహణకు విధివిధానాలు రూపొందిస్తామన్న నాని
  • థియేటర్ల విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని వెల్లడి
టాలీవుడ్ ప్రముఖులు ఏపీ సీఎం జగన్ తో ఈ మధ్యాహ్నం  భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీపై మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ, సినీ పరిశ్రమ సమస్యల పట్ల సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.  విశాఖలోనూ సినిమా చిత్రీకరణను ప్రోత్సహిస్తామని అన్నారు. విశాఖలో స్టూడియోలు నిర్మించుకోవాలని సినీ ప్రముఖులను కోరామని, తక్కువ ధరకే భూములిస్తామని వివరించారు. విశాఖలో ఇళ్లు కట్టుకోవాలనుకుంటే ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం చెప్పారని నాని తెలిపారు. రాష్ట్రంలో షూటింగులు జరుపుకోవడానికి విధివిధానాలు రూపొందిస్తామని పేర్కొన్నారు. చిన్న సినిమాలకు రాయితీలు ఇచ్చే యోచన ఉందని, థియేటర్ల విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని తెలిపారు.
Perni Nani
Tollywood
Jagan
Visakhapatnam
Studio
Theaters

More Telugu News