Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 83 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 25 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 7 శాతానికి పైగా పుంజుకున్న ఇండస్ ఇండ్ బ్యాంక్
Sensex ends 83 points higher

దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే భారీ లాభాల్లోకి వెళ్లిన సూచీలు... మధ్యాహ్నం తర్వాత కొంతమేర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో కొంతమేర లాభాలను కోల్పోయాయి. ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్యూ, ఐటీ, టెక్ సూచీలు లాభాలను ముందుండి  నడిపించాయి. హెల్త్ కేర్, మెటల్, ఆటో తదితర సూచీలు మాత్రం ఒత్తిడికి గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 83 పాయింట్లు లాభపడి 34,371కి పెరిగింది. నిఫ్టీ 25 పాయింట్లు పుంజుకుని 10,167 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (7.21%), యాక్సిస్ బ్యాంక్ (6.40%), ఓఎన్జీసీ (4.95%), బజాజ్ ఫైనాన్స్ (4.71%), టైటాన్ కంపెనీ (4.36%).

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-2.73%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.36%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.72%), నెస్లే ఇండియా (-1.69%), టాటా స్టీల్ (-1.43%).

More Telugu News