CEC: కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి కరోనా పాజిటివ్

Central Election Commission official tested corona positive
  • ఢిల్లీలో కరోనా బీభత్సం
  • ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కల్లోలం
  • ఇటీవలే నీతి ఆయోగ్ కార్యాలయంలోనూ ఉద్యోగికి పాజిటివ్
కరోనా మహమ్మారి ఎవరినీ వదలడంలేదు. దేశ రాజధాని ఢిల్లీలో వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ భూతం ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కలకలం రేపుతోంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారి కరోనా బారినపడ్డారు. దాంతో కార్యాలయాన్ని మూసివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

సదరు అధికారిని చికిత్సకు తరలించి, ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి క్వారంటైన్ విధించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈసీ భవనాన్ని పూర్తిగా శానిటైజ్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే నీతి ఆయోగ్ కార్యాలయంలో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆఫీసును మూసివేసి శానిటైజ్ చేసిన అనంతరం తిరిగి తెరిచారు.
CEC
Official
Corona Virus
Positive
New Delhi

More Telugu News