AIMIM: లడఖ్‌లోని భారత భూభాగాన్ని చైనా ఆర్మీ ఆక్రమించిందా? స్పష్టతనివ్వండి: అసదుద్దీన్

  • మన ఆర్మీ, చైనా ఆర్మీ చర్చలు జరుపుతున్నాయి
  • చైనాతో ఏ విషయంపై చర్చలు జరుపుతున్నారు?
  • కేంద్ర సర్కారు ఎందుకు మౌనంగా ఉంటోంది?
  • దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి
Can they tell us whether the Chinese military has occupied Indian territory in Ladakh  AIMIM Chief Asaduddin Owaisi

లడఖ్‌లోని భారత భూభాగంలోకి చైనా ఆర్మీ చొచ్చుకొచ్చి దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అగ్రశ్రేణి ఆర్మీ కమాండర్ల మధ్య చర్చలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఈ విషయంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

'మన ఆర్మీ, చైనా ఆర్మీ చర్చలు జరుపుతున్నాయి. చైనాతో ఏ విషయంపై చర్చలు జరుపుతున్నారన్న విషయాన్ని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. ఈ విషయాన్ని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది? ఎందుకు మౌనంగా ఉంటోంది? లడఖ్‌లోని భారత భూభాగాన్ని చైనా ఆర్మీ ఆక్రమించిందా? దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి' అని అసదుద్దీన్ నిలదీశారు.

More Telugu News