Varla Ramaiah: నారాయణస్వామి గారూ... అనితారాణిని అసభ్యంగా తిడితే మీరు కానీ, పోలీసులు కానీ పట్టించుకోలేదు: వర్ల

Varla Ramaiah targets Deputy CM Narayana Swamy in Doctor Anitha row
  • తనను వేధిస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన డాక్టర్ అనితారాణి
  • డిప్యూటీ సీఎం నారాయణస్వామిని టార్గెట్ చేసిన వర్ల
  • మీ నియోజకవర్గంలో జరిగినా పట్టించుకోలేదని విమర్శ
వైజాగ్ దళిత డాక్టర్ సుధాకర్ వ్యవహారం తర్వాత... ఇప్పుడు మరో దళిత డాక్టర్ అనితారాణి అంశం కలకలం రేపుతోంది. దిగువ స్థాయి సిబ్బంది అవినీతి గురించి ప్రశ్నించినందుకు... వైకాపా నేతలు పిలిపించి, తనను  రకరకాలుగా వేధించారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

బాత్రూమ్ లోకి వెళ్లినా తన ఫొటోలు, వీడియోలు తీశారని కంటతడి పెట్టారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉన్నా న్యాయం జరిగే పరిస్థితి లేదని అన్నారు. ఎవరికి చెప్పాలో అర్థం కాని స్థితిలో చివరకు హైకోర్టును ఆశ్రయించానని చెప్పారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామిని ఉద్దేశిస్తూ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు.

'నారాయణస్వామిగారూ, మీ నియోజకవర్గంలో ఉన్న పెనమలూరు వైద్యశాలలో దళిత డాక్టర్ అనితారాణిని మీ నాయకులు అసభ్యంగా, కులం పేరుతో తిడుతూ, మానసికంగా వేధిస్తుంటే... మీరు కానీ, పోలీసులు కానీ పట్టించుకోలేదు. తనను మరో డాక్టర్ సుధాకర్ ను చేస్తారేమోనని ఆమె భయపడుతున్నారు. కింకర్తవ్యం?' అని ప్రశ్నించారు.
Varla Ramaiah
Doctor Anitha Rani
Telugudesam
K Narayana Swamy
YSRCP
Harassment

More Telugu News